హైదరాబాద్: కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు మరోసారి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే కేసీఆర్ ఫాంహౌస్‌లో కబ్జా జరిగిందని నిరూపించాలంటూ చాలెంజ్ చేశారు. ఒకవేళ నిరూపిస్తే తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామన్నారు. కబ్జా కాదని తేలితే సీఎం సహా మంత్రులంతా రాజీనామాలు చేస్తారా? అని ప్రశ్నించారు.
గత రెండు రోజులుగా కేసీఆర్ ఫాంహౌస్ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీని కారణం సీఎం రేవంత్ వ్యాఖ్యలు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్.. కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు ఆదేశించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో 340 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, వెంటనే నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కల్వకంట్ల కుటుంబానికి 440 ఎకరాల భూమి ఉందని, ధరణిని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని రేవంత్ ఆరోపించారు.
అదే అంశంపై హరీష్‌రావు సీరియస్‌గా స్పందించారు. ఏదైతే 300 ఎకరాలు కబ్జా అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారో వాటిని నిరూపించాలంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. నిరూపిస్తే తమ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని, కాకపోతే మీరంతా రాజీనామా చేస్తారా? అని హరీష్ ప్రశ్నించారు. ఈ సవాల్‌కు కాంగ్రెస్ సిద్ధమా? అంటూ నిలదీశారు.
ఇదీ చదవండి: హైకోర్టులో ఎదురు దెబ్బ.. దానం నాగేందర్ యూటర్న్


