దానం నాగేందర్‌ తీర్పుపై కేటీఆర్‌ సంచలన ట్వీట్‌.. | KTR sensational tweet on Danam Nagender verdict | Sakshi
Sakshi News home page

దానం నాగేందర్‌ తీర్పుపై కేటీఆర్‌ సంచలన ట్వీట్‌..

Sep 18 2026 4:39 PM | Updated on Sep 18 2026 5:33 PM

KTR sensational tweet on Danam Nagender verdict

సాక్షి, హైదరాబాద్‌: దానం నాగేందర్‌ అనర్హత వేటుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ చేశారు. మిగతా ఫిరాయింపుదారులకు ఇదే గతి పడుతుందన్నారు. కాగా కొద్దిసేపటి క్రితం దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశంలో శాసనసభ స్పీకర్‌ ఇచ్చిన తీర్పును కొట్టిపడేసింది.

అయితే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సమయం ఇవ్వాలని దానం నాగేందర్‌ హైకోర్టును అభ్యర్థించగా కోర్టు తిరస్కరించింది. వెంటనే తీర్పు కాపీని స్పీకర్‌, ఈసీకి పంపాలని ఆదేశించింది. 

స్పీకర్ క్లీన్‌చిట్.. హైకోర్టులో సవాల్ 
ప్రతిపక్ష నేతల ఫిర్యాదులపై విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఈ ఏడాది మార్చి 11న సంచలన నిర్ణయం తీసుకున్నారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ ఆయనకు క్లీన్‌చిట్ ఇస్తూ అనర్హత పిటిషన్లను కొట్టివేశారు.

స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద స్పీకర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని తేల్చిచెప్పిన న్యాయస్థానం.. దానం నాగేందర్ ఎంపీగా పోటీచేసిన తేదీ నుంచే ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పుతో ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల్లోనా టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

సత్యమేవ జయతే..  దానం అనర్హత వేటుపై KTR సంచలన ట్వీట్


ఇదీ చదవండి: దానం నాగేందర్‌కు ఎదురు దెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement