హైకోర్టులో ఎదురు దెబ్బ.. దానం నాగేందర్‌ యూటర్న్‌ | Danam Nagender reacts to HC disqualification | Sakshi
Sakshi News home page

హైకోర్టులో ఎదురు దెబ్బ.. దానం నాగేందర్‌ యూటర్న్‌

Sep 18 2026 6:24 PM | Updated on Sep 18 2026 7:10 PM

Danam Nagender reacts to HC disqualification

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ తీర్పు వెలువడిన వెంటనే దానం నాగేందర్ యూటర్న్ తీసుకున్నారు. తొలుత ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పిన ఆయన, ఆ తర్వాత తన మనసు మార్చుకున్నారు. హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ ఆయన మాట్లాడుతూ.. ‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన నాకు లేదు. ఉప ఎన్నిక వస్తే మళ్లీ పోటీ చేస్తా. యుద్ధం నాకేం కొత్త కాదు. మళ్లీ పోరాడుతా.. మళ్లీ గెలుస్తా!’ అని ధీమా వ్యక్తం చేశారు. 

హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక దాదాపు ఖాయమగడంతో, దానం నాగేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సుప్రీం కోర్టుకు దానం నాగేందర్ ..?

ఇదీ చదవండి : దానం నాగేందర్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement