
ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి లోపాయికారీ ఒప్పందం
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారం తమ చేతిలో ఉందనే ధైర్యంతో బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బరితెగించి మాట్లాడుతు న్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. హరీశ్‌రావు శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకుని సహకరిస్తున్నందునే ఏపీ సీఎం చంద్రబాబు ఆడిందే ఆట అన్నట్లుగా వ్యవహరి స్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ ప్రకటనపై సీఎం రేవంత్, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బనకచర్ల అంశం ఎజెండాలో ఉంటే చర్చకు వెళ్లబోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటిస్తే, సీఎం రేవంత్ మాత్రం భేటీకి హాజరై కమిటీ ఏర్పాటుకు అంగీకరించార ని మండిపడ్డారు.
బనకచర్లపై చంద్రబాబు అనుస రిస్తున్న బుల్డోజ్ విధానానికి బీజేపీ, కాంగ్రెస్ మౌనమే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనా లను పక్కన పెట్టి చంద్రబాబు, బీజేపీ మెప్పుకోసం సీఎం రేవంత్ ప్రయత్నిస్తు న్నారని ధ్వజమెత్తారు. అధికారం, మందబలాన్ని చూసుకుని బనకచర్లపై లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
నీళ్లు తీసుకుపోతే ఊరుకుంటామా?
గోదావరిలో మిగులు జలాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు బనకచర్లపై ఏపీ పంపిన డీపీఆర్‌ను ఎందుకు వెనక్కి తిప్పి పంపాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లు పెట్టి నీళ్లు తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదని చెప్తున్న నారా లోకేశ్.. ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తన తండ్రి చంద్ర బాబు కేంద్రానికి రాసిన 7 లేఖల గురించి తెలుసుకో వాలని హితవు పలికారు. కాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడి గడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి తరలించుకు పోయే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.
బనకచర్లను ఏపీ కట్టి తీరితే, తాము అడ్డుకుని తీరుతా మని స్పష్టంచేశారు. ‘గోదావరి నదిలో మా వాటాను అడిగితే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నా మని లోకేశ్ అంటున్నారు. గతంలో బాబ్లీ, ఆల్మట్టిపై చంద్ర బాబు చేసిన పోరాటాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టేందుకేనా? సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ హక్కులను కాపాడుతుంది. అనుమతు లు తెచ్చుకునే పద్ధ తి మీకు తెలిస్తే, ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు.
బనక చర్ల ద్వారా గోదావరి నీళ్లు మాత్రమే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించుకు పోయే కుట్రను చంద్రబాబు బయట పెట్టారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం వెనుక ఈ కుట్ర దాగి ఉంది. లోక్‌సభలో కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణ నుంచి 8 మంది చొప్పున ఎంపీలున్నా బనకచర్లపై వాయిదా తీర్మాణం ఇచ్చి రాష్ట్ర హక్కు లను కాపాడటం లేదు’అని హరీశ్‌రావు మండిపడ్డారు.