పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది: వైద్యుల వెల్లడి | Former MLA Peddi Sudarshan Reddy Health Updates | Sakshi
Sakshi News home page

పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది: వైద్యుల వెల్లడి

Jul 26 2026 10:16 AM | Updated on Jul 26 2026 12:44 PM

Former MLA Peddi Sudarshan Reddy Health Updates

సాక్షి, వరంగల్‌: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అదుపులో ఉన్నట్లు రోహిణి ఆసుపత్రి సుపరిండెంట్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు పెద్దిని వరంగల్‌లోని రోహిణి  ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం కొనసాగుతోంది.  

అయితే, పెద్ది మరణించారంటూ వస్తున్న వార్తలపై రోహిణి హాస్పిటల్ సుపరిండెంట్ సుధాకర్ రెడ్డి ఖండించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు. సీపీఆర్‌ జరుగుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మీడియాకు తెలిపారు.

‘‘నిన్న రాత్రి సీటీ స్కాన్‌తో పాటు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యులు నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు వైద్య బృందం ద్వారా తెలియజేస్తాయని డాక్టర్‌ సుధాకర్ రెడ్డి తెలిపారు.

మెరుగైన వైద్య చికిత్స కోసం సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి  తరలిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ వెంటే హైదరాబాద్‌కు కేటీఆర్‌, హరీష్‌రావు బయలుదేరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement