ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు చెల్పూరి రాజమౌళి. తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. బావిలో సరిపడా నీరు లేదు. ఆడపా దడపా వానలకు పంటలు పండించాడు. ఇక లాభం లేదని జైన్ ఇరిగేషన్ కంపెనీలో రిప్రజెంటేటివ్‌గా చేరాడు. మొదట తన పంట పొలానికి డ్రిప్ బిగించుకున్నాడు. గంటన్నర నీటితో రెండు ఎకరాలలో సిరులు పండించాడు. గ్రామంలోని రైతులందరిని చైతన్యం చేశాడు. 100 మంది రైతులకు 99 మంది డ్రిప్ బిగించుకున్నారు. విభిన్న వాణిజ్య పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.


