వరంగల్ లీగల్: న్యాయవాదులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని హైకోర్టు జడ్జి, వరంగల్, హనుమకొండ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ సేనారెడ్డి అన్నారు. శనివారం కోర్టు ప్రాంగణంలో హనుమకొండ జిల్లా కోర్టుకు నూతనంగా కేటాయించబడిన మూడో అదనపు జిల్లా కోర్టు, ఐదు, ఆరు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులను, ఆలాగే పునర్నిర్మించిన వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనాన్ని జస్టిస్ విజయ సేనారెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీ.బి. నిర్మాల గీతాంబ హనుమకొండ జిల్లా ప్రధానన్యాయమూర్తి ఎంఆర్. సునీత నేతృత్వంలో వేద పండితులు జస్టిస్ విజయసేనారెడ్డికి స్వాగతం పలికారు.
వృత్తిలో తీర్చిదిద్దాలి..
ఉభయ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో జస్టిస్ విజయసేనారెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదుల పక్షాన చేసిన విజ్ఞప్తులను సానుకూల దృష్టితో పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. సీనియర్ న్యాయవాదులు.. యువ న్యాయవాదులను వృత్తిలో తీర్చిదిద్దాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలాగీతాంబ, సునీత, ఉభయ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు చొల్లేటి రామకృష్ణ, చకిలం ఉపేందర్, బార్ కౌన్సిల్ సభ్యులు ఎం.సహోదర్‌రెడ్డి, న్యాయమూర్తులు, న్యాయవ్యాదుల సంఘ ప్రతినిధులు నాగేంద్రచారి, నరేందర్, సాంబశివరాజు, రఘుపతి, లలితకుమారి, వనజ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జి జస్టిస్ బి.విజయసేనారెడ్డి
కోర్టు భవనం ప్రారంభం


