వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jul 26 2026 8:06 AM | Updated on Jul 26 2026 8:06 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026

పెరిగిన టోల్‌ ప్లాజా రుసుములు

వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్‌ ప్లాజా రుసుములు పెరిగాయి. పెరిగిన చార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం

విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికుల సమస్యల పరి ష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని టీ ఎస్‌ ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనర ల్‌ శ్రీధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై

ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఉంటుంది. సాయంత్రం సమయంలో అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.

గీసుకొండ: జిల్లాలో తొలిఏకాదశి వేడుకలను ప్రజలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్‌, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఆలయాల్లో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. కురుమ కులస్తులు బీరన్న బోనాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకెళ్లారు. వరంగల్‌ ఓసిటీ, కరీమాబాద్‌లో మంత్రి కొండా సురేఖ, మాజీ మేయర్‌ గుండు సుధారాణి బీరన్న బోనాలు ఎత్తుకొని మొక్కులు చెల్లించారు. గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారికి అర్చకులు, భక్తులు లక్ష పుష్పార్చన నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్ర మాల్లో ఈఓ పి.ప్రసాద్‌, ప్రధాన అర్చకుడు కాండూరి రామాచార్యులు, అర్చకులు విష్ణు, ఫణీంద్ర, కొమ్మాల, సూర్యతండా సర్పంచ్‌లు కన్నెబోయిన యమునప్రవీణ్‌, బానోత్‌ రాఘవేంద్ర, భక్తులు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో తొలిఏకాదశి

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వైభవంగా బీరన్న బోనాల ఊరేగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement