సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం | fire accident in secunderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

Jun 25 2026 3:17 PM | Updated on Jun 25 2026 4:50 PM

fire accident in secunderabad

సాక్షి,హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం (జూన్‌25) స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభంచింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అర్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 

2023లోనూ ప్రమాదం
సికింద్రాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సముదాయమైన స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో 2023 మార్చి 16వ తేదీ గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు (నలుగురు యువతులు, ఇద్దరు యువకులు) ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మార్చి 16, రాత్రి దాదాపు 7:30 నుండి 7:45 గంటల సమయంలో కాంప్లెక్స్ బి-బ్లాక్‌లోని 7వ లేదా 8వ అంతస్తులో మంటలు ప్రారంభమై, వేగంగా కింది అంతస్తులకు వ్యాపించాయి.

ఐదో అంతస్తులోని ఎయిర్ కండిషనర్ యూనిట్ లేదా ఏడో అంతస్తులో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే దాదాపు 15 ఫైర్ ఇంజన్లు, బ్రోంటో స్కైలిఫ్ట్ వంటి అత్యాధునిక యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అర్ధరాత్రి వరకు శ్రమించి మంటలను అదుపు చేశారు. 

దాదాపు 12 మందికి పైగా వ్యక్తులను సురక్షితంగా రక్షించారు. మరణించిన వారంతా 22 నుండి 23 సంవత్సరాల లోపు వయసున్న నిరుద్యోగ యువతీయువకులే. వీరంతా బతుకుదెరువు కోసం గ్రామాల నుండి హైదరాబాద్ వచ్చి, ఆ కాంప్లెక్స్‌లోని ఒక ఆఫీసులో పని చేసినట్లు తేలింది. మళ్లీ ఇప్పుడు అదే స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో ప్రమాదం చోటు చేసుకోవడం మరింత భయాందోళనను రేకెత్తిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement