చల్‌..చల్‌ గుర్రం... ఆశల సేద్యం | farmer uses horse for farming instead of bullocks | Sakshi
Sakshi News home page

గుర్రంతో వ్యవసాయం.. పల్లెల్లో చర్చనీయాంశం

Jun 22 2026 8:18 AM | Updated on Jun 22 2026 8:18 AM

farmer uses horse for farming instead of bullocks

కర్నూలు: ప్రస్తుతం వ్యవసాయం చేయాలంటే కాడెద్దులు తప్పనిసరి. ఈరోజుల్లో కాడెద్దులు కొనాలంటే రూ. లక్షలు పెట్టడంతో పాటు వాటి పోషణ భారం కూడుకున్నది. పీ.కొత్తూరుకు చెందిన చెన్నప్ప అనే రైతు గుర్రంతో సేద్యం చేస్తున్నారు. తనకున్న ఐదెకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని కంది, సజ్జ తదితర పంటలు సాగు చేస్తున్నారు. రూ.7వేలకు కొనుగోలు చేసిన గుర్రం ఆరేళ్ల క్రితం చనిపోగా.. దాని పిల్ల గుర్రాన్ని ఆప్యాయంగా పెంచుకున్నారు. ఇప్పుడు ఆ పిల్ల గుర్రమే సాగులో తోడుగా నిలిచింది. దాంతో సేద్యం పనులు చేస్తూ, విత్తనం సైతం విత్తుతున్నారు. గుర్రంతో సాగు చేస్తుండగా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement