రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు  | Farewell to the President | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు 

Dec 24 2023 4:18 AM | Updated on Dec 24 2023 4:18 AM

Farewell to the President - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శీతాకాల విడిది ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీకి తిరిగి వెళ్లారు. రాష్ట్రపతికి శనివారం హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు.

డిసెంబర్‌ 18న శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రావడం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆమె పోచంపల్లిలో థీమ్‌ పెవిలియెన్‌ పార్క్‌లో చీరల తయారీ యూనిట్‌ను సందర్శించి అక్కడి కార్మికులతో ముచ్చటించారు.

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పర్యాటకులను ఆకర్షించేందుకు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముర్ము ప్రారంభించారు. శీతాకాల విడిది ముగించుకుని శనివారం ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తిరిగి వెళ్లారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement