breaking news
winter stay
-
రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీకి తిరిగి వెళ్లారు. రాష్ట్రపతికి శనివారం హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. డిసెంబర్ 18న శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రావడం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆమె పోచంపల్లిలో థీమ్ పెవిలియెన్ పార్క్‌లో చీరల తయారీ యూనిట్‌ను సందర్శించి అక్కడి కార్మికులతో ముచ్చటించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పర్యాటకులను ఆకర్షించేందుకు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముర్ము ప్రారంభించారు. శీతాకాల విడిది ముగించుకుని శనివారం ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తిరిగి వెళ్లారు. -
రేపట్నుంచి నెలాఖరు వరకు నగరంలో రాష్ట్రపతి విడిది
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు (గురువారం) హైదరాబాద్ రానున్నారు. ఆయన శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌లోనే ఉంటారు. కాగా, ఈ మధ్య కాలంలో ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. ఈనెల 23వ తేదీన అనంతపురంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొంటారు. అలాగే 24వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుకు హాజరవుతారు. ఈనెల 31వ తేదీన ఆయన తిరిగి ఇక్కడినుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తారు.