ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి! | Extra Marital Affair In HyderabadT | Sakshi
Sakshi News home page

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

Jun 23 2026 8:00 AM | Updated on Jun 23 2026 11:43 AM

Extra Marital Affair In HyderabadT

హైదరాబాద్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం కీసర పోలీస్‌ స్టేషన్‌లో ఏసీపీ చక్రపాణి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి భార్య జ్యోతి, కుమారుడితో కలిసి చీర్యాలలోని ఈడెన్‌ గార్డెన్‌లో ఉంటున్నారు. జ్యోతికి తుర్కపల్లికి చెందిన నవీన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.గత నెల 29న నవీన్‌.. జ్యోతి ఇంటికి వచ్చాడు.

 తమ వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని జ్యోతి సహకారంతో నవీన్‌ బాలుడిని నేలపై బలంగా కొట్టగా మృతిచెందాడు. బాలుడు ప్రమాదవశాత్తు మంచంపై నుండి పడిపోవడం వల్ల మృతిచెందాడని నిందితురాలు భర్తను నమ్మించింది. ఆ తరువాత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖననం బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఫొరెన్సిక్‌ పరీక్షలు చేశారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర సాక్షాల ప్రకారం తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డి, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement