సాక్షి,హైదరాబాద్: పేలుళ్లతో దేశ రాజధాని ఢిల్లీ నగరం ఉలిక్కి పడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు.
ఢిల్లీ పేలుడుతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీలో అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. ప్రధానంగా హైదరాబాద్ పాత నగరం నాకాబందీతో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పేలుళ్ల దృష్ట్యా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు,వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి’అని కోరారు.


