ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు: రఘుమారెడ్డి 

Do not believe that jobs will be given: Raghumareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారులు, సంస్థ సిబ్బంది మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సంస్థ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) నియామకంలో నిర్ణిత అర్హతలు ఉండి, స్తంభాలు ఎక్కే (పోల్‌ క్లైంబింగ్‌) పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ అనుసరించి అత్యంత పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

మెరిట్, రూల్‌ మాఫ్‌ రిజర్వేషన్స్‌ను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన అభ్యర్థులకు ఈనెల 28 నుంచి వివిధ జిల్లా/సర్కిల్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్, పోల్‌ క్లైంబింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు ఈ ఏడాది నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top