భూ వివాదం: నిర్మాత సురేష్‌బాబు, రానాలపై క్రిమినల్‌ కేసు నమోదు

Criminal Case Registered Against Producer Suresh Babu And Rana - Sakshi

హైదరాబాద్‌:  ఫిలింనగర్‌ భూ వివాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది.  కోర్టు ఆదేశాల మేరకు నిర్మాత సురేష్‌బాబు, రానాలపై క్రిమినల్‌ కేసు నమోదైంది. తమను దౌర్జన్యంగా ఖాళీ చేయించారని వ్యాపారి ప్రమోద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఖాళీ చేయకుంటే అంతు చూస్తామని సురేష్‌బాబు బెదిరించినట్లు ఆరోపించారు.  

ఫిర్యాదు చేసినా బంజరాహిల్స్‌ పోలీసులు పట్టించుకోలేదన్నారు. దాంతో నాంపల్లి కోర్టును బాధితుడు ఆశ్రయించాడు. సురేష్‌బాబు, రానా సహా మరికొందరిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. దాంతో సురేష్‌బాబు, రానాపై కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top