భారతీయ ఇండీ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా రానా | Shape Of Momo Movie Released By Rana Daggubati | Sakshi
Sakshi News home page

భారతీయ ఇండీ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా రానా

May 28 2026 8:15 PM | Updated on May 28 2026 8:43 PM

Shape Of Momo Movie Released By Rana Daggubati

తెలుగు హీరో రానా దగ్గుబాటికి చెందిన 'స్పిరిట్ మీడియా' మన దేశంలో ఇండీ  సినిమాలకు సరికొత్త ప్లాట్‌ఫామ్‌గా మారుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇండియాలోని అన్ని భాషలకు చెందిన చిన్న చిత్రాలను, క్రియేటివ్ కథలను సపోర్ట్ చేస్తూ వాటిని థియేటర్ల వరకు తీసుకురావడానికి స్పిరిట్ మీడియా గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలను, మన నేటివిటీకి దగ్గరగా ఉండే నిజాయితీ గల కథలను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడమే స్పిరిట్ మీడియా మెయిన్ టార్గెట్.

దీనివల్ల పెద్దగా గుర్తింపు లేని ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులు, రచయితలకు తమ కథలను దేశవ్యాప్తంగా చూపించే ఒక అద్భుతమైన ఛాన్స్ దొరుకుతోంది. ఈ ఇండీ ఫిలిం మూవ్‌మెంట్‌లో ప్రస్తుతం నార్త్ ఈస్ట్ సినిమాలు చాలా స్పెషల్‌గా నిలుస్తూ వేగంగా ఎదుగుతున్నాయి. సిక్కిం, అసోం, మణిపూర్ లాంటి ప్రాంతాల నుండి వస్తున్న సినిమాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతి ఇస్తున్నాయి. అక్కడి విభిన్నమైన కల్చర్‌ని, అచ్చమైన భావోద్వేగాలని చాలా రియలిస్టిక్‌గా చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న సిక్కిం మూవీ 'షేప్ ఆఫ్ మోమో'ని చెప్పుకోవచ్చు.

ట్రిబేనీ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే 15కి పైగా అంతర్జాతీయ అవార్డ్స్ గెలుచుకుంది. జోయా అక్తర్, పాయల్ కపాడియా లాంటి క్రేజీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా సపోర్ట్ ఇవ్వడం విశేషం. ఇలాంటి అద్భుతమైన సినిమాలను థియేటర్లకు తీసుకురావడం ద్వారా స్పిరిట్ మీడియా అన్ని ప్రాంతాల సినిమాలకు సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక మంచి సినిమా కల్చర్ ని బిల్డ్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement