సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ పేదల కోసం తెచ్చిన సన్నబియ్యం పథకాన్ని గుర్తుచేసేలా సీఎంకి పుట్టినరోజు కానుక ఇచ్చారు.
తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్.. సీఎం రేవంత్‌కి సృజనాత్మకంగా సన్నబియ్యంతో శుభాకాంక్షలు తెలిపారు. 57 ఏళ్ల సీఎం రేవంత్‌కి 57 కిలోల సన్నబియ్యంతో చిత్ర పటం వేశారు. సన్నబియ్యం పథకాన్ని గుర్తుచేసేలా సీఎంకి పుట్టినరోజు కానుక ఇచ్చారు. పేదోడికి కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి సన్నబియ్యంతో చిత్రపటాన్ని చేయించి కృతజ్ఞత చాటుకున్నారు. పేదలకి సన్నబియ్యాన్ని ఇచ్చిన రేవంత్ వందేళ్ళు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


