తెలంగాణ కేబినెట్‌ భేటీ.. వాటిపైనే చర్చ! | CM Revanth Reddy: Telangana Cabinet Meeting Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్‌ భేటీ.. వాటిపైనే చర్చ!

Jun 5 2025 3:22 PM | Updated on Jun 5 2025 9:46 PM

CM Revanth Reddy: Telangana Cabinet Meeting Updates

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్‌ సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో జూన్ -జులై లో  పంచాయతీ ఎన్నికల  నిర్వహణ ఏ మేరకు సురక్షితం అన్నదానిపై కేబినెట్‌ చర్చించింది.

ఇప్పటికే ఆలస్యం అయిందని.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కొందరు మంత్రులు కోరగా, వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని మరి కొందరు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళా సంఘాల బీమా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.


 

Advertisement
 
Advertisement
Advertisement