రైతు భరోసా నిధులు విడుదల | CM Revanth Reddy releases Rythu Bharosa funds | Sakshi
Sakshi News home page

రైతు భరోసా నిధులు విడుదల

Jun 30 2026 7:06 PM | Updated on Jun 30 2026 7:13 PM

CM Revanth Reddy releases Rythu Bharosa funds

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత కరెంట్‌ ఇ‍చ్చిన ఘనత దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైస్సాఆర్‌కే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతుభరోసాకు సంబంధించిన నిధులు రూ. 2,482 కోట్లను సీఎం రేవంత్ ఈ రోజు ( మంగళవారం) బటన్ నొక్కి విడుదల చేశారు. తొలివిడతలో భాగంగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమయ్యాయి. 30 నెలల్లో రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషిచేశామని రూ. 2లక్షల వరకూ రుణమాఫీ చేశామని పేర్కొన్నారు.

రైతు భరోసా కింద ఇప్పటి వరకూ రూ.30 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామని తెలిపారు.  వ్యవసాయం దండగ కాదని పండగని నిరూపించామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఎక్కడికక్కడ బకాయిలు పెట్టి సర్వనాశనం చేశారని ఆరోపించారు. విధ్యంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement