చర్చలు సానుకూలం.. సీఎం రేవంత్ | CM Revanth Reddy meets Union Railway Minister | Sakshi
Sakshi News home page

చర్చలు సానుకూలం.. సీఎం రేవంత్

Jun 22 2026 9:46 PM | Updated on Jun 23 2026 11:36 AM

CM Revanth Reddy meets Union Railway Minister

సాక్షి, ఢిల్లీ: కేంద్రమంత్రి అశ్విణీ వైష్ణవ్‌తో చర్చలు సానూకూలంగా సాగాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఆరోజు( సోమవారం) రైల్వేశాఖ మంత్రితో ఆయన సమావేశమయ్యారు. రేపు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఖట్టర్‌తో తాను, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి భేటీ అవుతామని అనంతరం మెట్రో విషయంలో ఒక క్లారీటీ వస్తుందన్నారు.

కాగా కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ రెండుగంటలకు పైగా సాగింది.  మెట్రో- ఫేజ్‌- 2 పనులు, ఐఆర్‌ఏఫ్‌సీ రుణాల విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రితో భేటీ ఏర్పాటు చేశారు.

కిషన్‌ రెడ్డిపై విమర్శలు

కాగా ఇటీవల మెట్రో ఫేజ్‌-2 పనులను కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్‌ రెడ్డి  కేంద్రాన్ని  ప్రశ్నించడంతో  ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు ఆపేసిందన్నారు.కిషన్ రెడ్డి పట్ల తనకు వ్యతిరేకత లేదని మెట్రో విషయంలో ఆయన ధైర్యంగా ఉంటే తాను అండగా ఉంటాను. మెట్రో విషయంలో కేంద్రం వెంటనే లోన్ రిలీజ్‌ చేయకపోతే ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మెట్రో అంశమై కేంద్ర మంత్రితో కీలక భేటీ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement