Hyderabad: మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య | brutal murder of a married woman | Sakshi
Sakshi News home page

Hyderabad: మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణ హత్య

Oct 1 2024 7:08 AM | Updated on Oct 1 2024 12:32 PM

brutal murder of a married woman

మియాపూర్‌: ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేసిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.వైజాగ్‌కు చెందిన బండి స్పందన(29)దీప్తీ శ్రీనగర్‌ కాలనీలోని సీబీఆర్‌ ఎస్టేట్‌లో అపార్ట్‌మెంట్‌లో తల్లి నమ్రత, సోదరుడితో కలిసి నివాసముంటోంది. ఆమెకు 2022లో వారణాసి వినయ్‌ కుమార్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న స్పందన తల్లి నమ్రత  సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లింది. 

సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా బయటి నుంచి తాళం వేసి ఉంది. దీంతో ఆమె కుమార్తెకు  ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిచూడగా బెడ్‌రూమ్‌లో  స్పందన రక్తపు మడుగులో కనిపించింది. ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలు ఉన్నాయి. దీంతో ఆమె మియాపూర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న  ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.  

Advertisement
 
Advertisement
Advertisement