ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్‌ను బీఆర్‌ఎస్ దాఖలు చేసింది. దీనిని విచారణకు త్వరగా స్వీకరించాలని చీఫ్ జస్టిస్ కోర్టులో న్యాయవాదులు అభ్యర్థించారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని, దీంతో వారు ఇంకా ఎమ్మెల్యేలు గానే కొనసాగుతున్నారని దానిలో పేర్కొన్నారు.
ఈ విషయంలో ప్రొసీడింగ్స్ ఆలస్యం చేస్తే, వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ ఇంకా ప్రొసీడింగ్స్ ఎవిడెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయని న్యాయవాదులు పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి రిటైర్ అయ్యేంతవరకు ప్రక్రియను సాగదీయాలని చూస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి..నవంబర్ 24 తో సుప్రీంకోర్టు ముగిసినట్టు కాదని అన్నారు. వచ్చే సోమవారం కేసు విచారణ చేస్తామని తెలిపారు.


