చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం | Blaze In industrial Area Of Cherlapally | Sakshi
Sakshi News home page

చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

Feb 4 2025 8:14 PM | Updated on Feb 4 2025 9:30 PM

 Blaze In industrial Area Of Cherlapally

హైదరాబాద్‌: చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  ఓ కెమికల్‌ కంపెనీలో మంటలు ఒక్కసారిగా చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో కెమికల్‌ వాసనలు చుట్టుపక్కలకు వ్యాపించాయి.  రియాక్టర్లు పేలడంతో  ఓ బిల్డింగ్‌ కుప్పకూలినట్లు తెలుస్తోంది. 

దాంతో పాటు కెమికల్‌ వాసనలకు భరించలేక స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement