బ్లాక్‌ఫంగస్‌ కేసుల్లో తెలంగాణది ఏడోస్థానం  | Black Fungus Cases Spreading In Telangana | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ఫంగస్‌ కేసుల్లో తెలంగాణది ఏడోస్థానం 

Aug 3 2021 3:28 PM | Updated on Aug 3 2021 3:28 PM

Black Fungus Cases Spreading In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: బ్లాక్‌ఫంగస్‌ కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలోనే ఏడోస్థానంలో నిలిచిందని, గత నెల 28వ తేదీ నాటికి 2,578 కేసులు నమోదయ్యాయని, అత్యధికంగా మహారాష్ట్రలో 9,654 బాధితులు ఫంగస్‌ బారినపడ్డారని తెలిపింది. తెలంగాణ కంటే అధికంగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైన రాష్ట్రాల్లో గుజరాత్‌ 6,846, ఆంధ్రప్రదేశ్‌ 4,209, తమిళనాడు 4,075, కర్ణాటక 3,648, రాజస్థాన్‌ 3,536 కేసులు నమోదయ్యాయి.

అతి తక్కువ నమోదైన రాష్ట్రాల్లో నాగాలాండ్, త్రిపుర ఒకటి చొప్పున, మణిపూర్‌ 7, అసోం 10, గోవా 30, హిమాచలప్రదేశ్‌ 31, జమ్మూకాశ్మీర్‌ 47 ఉన్నాయని తెలిపింది. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు దేశంలో మే రెండోవారం తర్వాత ఎక్కువయ్యాయనీ, ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. కరోనాతో ఆసుపత్రుల్లో చేరినవారికి ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్ల ఇవ్వడం వల్ల షుగర్‌ పెరగడం తదితర కారణాలతో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఎక్కువయ్యాయని తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement