చైనా స‌రిహ‌ద్దులో ఆర్మీ జ‌వాను మృతి | Army Jawan From Aasifabad Died In China border | Sakshi
Sakshi News home page

చైనా స‌రిహ‌ద్దులో ఆర్మీ జ‌వాను మృతి

Oct 17 2020 7:52 PM | Updated on Oct 17 2020 7:57 PM

Army Jawan From Aasifabad  Died In China border   - Sakshi

కొమురం భీం, ఆసిఫాబాద్ :  చైనా స‌రిహ‌ద్దులో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జ‌వాను మ‌ర‌ణించారు. వివ‌రాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణం అహ్మద్ రజా కాలనీకి చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ షాకీర్  చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో చనిపోయాడు.. ఆరుగురు బృందంతో విధులు నిర్వర్తిస్తుండగా కొండ చరియలు విరిగిపడి మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు.   17 ఏళ్లుగా షాకీర్ ఆర్మీలో  విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షాకీర్ మృతితో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి

Advertisement
 
Advertisement
Advertisement