​​​​​​​పెయింట్‌ డబ్బాలో చిక్కుకున్న పాము | - | Sakshi
Sakshi News home page

​​​​​​​పెయింట్‌ డబ్బాలో చిక్కుకున్న పాము

Jul 3 2023 1:16 AM | Updated on Jul 3 2023 8:41 AM

డబ్బాలో పాము   - Sakshi

డబ్బాలో పాము

మైలాడుదురై బి జిల్లా కొల్లిడం సమీపంలో ఒక పాము పెయింట్‌ డబ్బాలో తల చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడింది.

తమిళనాడు: మైలాడుదురై బి జిల్లా కొల్లిడం సమీపంలో ఒక పాము పెయింట్‌ డబ్బాలో తల చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడింది. ఈ వీడియో వైరల్‌ అయింది. అలక్కుడి తోనితురకు చెందిన ఇందుమతి (30) ఇంటికి ఎదురుగా ఉన్న ముళ్ల కంచె పక్కన పాము తిరుగుతోంది. అది దానంతట అదే వెళ్లిపోతుందని అందరూ భావించారు. ఈ క్రమంలో పాము మూడు రోజుల క్రితం పెయింట్‌ డబ్బాలోకి దూరేందుకు ప్రయత్నించింది.

డబ్బా మూతలో తల ఇరుక్కుపోవడంతో అది లోపలికి వెళ్లలేక, బయటకు రాలేక అలాగే విలవిలలాడుతూ ఉండిపోయింది. పాము వెళ్లిపోతుందని భావించిన ఇందుమతి కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించింది. ఆ సమయంలో దినేష్‌ అనే వ్యక్తి చిన్న పెయింట్‌ డబ్బాను పాము తలపై పెట్టడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. పాము ప్రాణాలతో పోరాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

×
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement