డీజే శబ్దాలతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

డీజే శబ్దాలతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం : ఎస్పీ

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

సూర్యాపేటటౌన్‌ : ప్రస్తుతం ఏవేడుకై నా డీజే శబ్దాలు లేకపోతే హుషారు లేదనుకునే పరిస్థితి నెలకొంటొందని, అధిక శబ్దం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పరిమితికి మించిన డెసిబెల్‌ శబ్దాలను ఎక్కువసేపు వినడం వల్ల వినికిడి లోపం, తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, రక్తపోటు, గుండె పోటు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనా రోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు అధిక శబ్దం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధిక శబ్దాలపై నిషేధిత నిబంధనలు అమల్లో ఉన్నాయని, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు డీజే సౌండ్‌ సిస్టమ్‌లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

సూర్యక్షేత్రంలో

ప్రత్యేక పూజలు

అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారా యణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్‌స్వామి, గణపురం నరేష్‌, అర్చకులు పాల్గొన్నారు.

లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతి, అర్చకులు పాల్గొన్నారు.

యూపీఐ లావాదేవీలపై టాక్స్‌ ఎత్తివేయాలి

సూర్యాపేట అర్బన్‌ : కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై విధించిన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం.ఎల్‌ ) మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఐ చెల్లింపులపై కేంద్రం అమెరికా ఒత్తడి మేరకే పన్ను వేసే పద్ధతిని తీసుకొచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు భీమనపల్లి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement