24 నుంచి విద్యుత్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు | - | Sakshi
Sakshi News home page

24 నుంచి విద్యుత్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

సూర్యాపేట అర్బన్‌ : వర్షాభావ పరిస్థితులతో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 24, 25 తేదీలలో జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల పంటలు ఎండి పోతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదన్నారు. రైతులకు నిరంతరం విద్యుత్‌ అందించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఆందోళన కార్యక్రమాలలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, దండ వెంకటరెడ్డి, దేవరం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement