రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపిక

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

కోదాడ రూరల్‌ : రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు కోదాడకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. కోదాడ పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎం సంకల్ప పాఠశాలలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అనస్‌ (మాంటిస్సోరి స్కూల్‌), రిశాన్‌ (ఎస్పీఆర్‌ గురుకుల్‌ స్కూల్‌), భానుప్రకాష్‌, కీర్తన్‌ (బాయ్స్‌ హైస్కూల్‌), ముఫాజ (ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌), ఏకాంక్ష (ఏకశిల న్యూవిజన్‌ స్కూల్‌) అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులను ఎంఈఓ సలీం షరీఫ్‌ అభినందించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కిరణ్‌, కోచ్‌లు అంజి, సిద్ధిక్‌, ఖాజామియా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement