ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

ప్రధాన డిమాండ్లు ఇవే..

సూర్యాపేటటౌన్‌ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. ప్రతి ఆరు నెలలకు మంజూరు కావాల్సిన డీఏలు అందకపోవడం, వారికి రావాల్సిన బిల్లులు, జీపీఎఫ్‌ రుణాలు వంటివి సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండడంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘాల నాయకులు చెబుతున్నారు. వాటి సాధనకు ఉద్యమించాలని అన్ని సంఘాల జేఏసీ నిర్ణయించిది.

పీఆర్సీ, పెండింగ్‌ బిల్లులపై ..

ప్రతి ఐదేళ్లకు ఒక సారి పే రివిజన్‌ కమిషన్‌(పీఆర్‌సీ) సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల వేతనాలను సవరించాల్సి ఉంటుంది. 2023 జూలైలో అమల్లోకి రావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాంతో ఒక్కో ఉద్యోగి నెలకు సుమారు రూ.20 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏలను ఎప్పటి కప్పుడు పెంచకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారని, ఇప్పటి వరకు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉద్యోగుల జీపీఎఫ్‌ రుణాలు, పార్ట్‌ ఫైనల్‌ బిల్లులు ఏడాది దాటినా మంజూ కావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నేడు మహా ధర్నా.

సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు అర్జీలు, వినతిపత్రాలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం సానుకూలంగాా స్పందించడం లేదని, దాంతో 206 ఉద్యోగ సంఘాలతో ఏర్పడిన తెలంగాణ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు సూర్యాపేట వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది.

ఫ వచ్చే నెల 30లోపు రెండో పీఆర్సీ నివేదకను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలి.

ఫ పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలి.

ఫ ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి.

ఫ పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్‌ కోసం నెలకు రూ.రెండు వేల కోట్లు విడుదల చేయాలి.

ఫ ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేసి సీపీఎస్‌ను రద్దు చేయాలి.

ఫ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉంటున్న సమస్యలను పరిష్కరించాలి.

నేడు కలెక్టరేట్‌ ఎదుట టీజీఈ జేఏసీ మహాధర్నా

ఫ పెండింగ్‌ బిల్లులు,

పీఆర్సీపై తప్పని నిరీక్షణ

ఫ డీఏలు, జీపీఎఫ్‌ రుణాలు, సరెండర్‌ లీవ్‌ బిల్లులకు కలగని మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement