గమ్యం చేరకుండానే తెల్లారిన బతుకులు | - | Sakshi
Sakshi News home page

గమ్యం చేరకుండానే తెల్లారిన బతుకులు

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

కోదాడ మండలం దోరకుంట వద్ద డివైడర్‌పై ఆగిన లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

గాలిలో కలిసిన ఆరుగురి ప్రాణాలు రాఖీ పండుగ వేళ విషాదం

కోదాడ: స్వగ్రామంలో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అనుకున్న వారి ఆశలు.. జాతీయ రహదారిపైనే రక్తమోడాయి. కష్టపడి చదువుకుని, ఇప్పుడిప్పుడే సాఫ్ట్‌వేర్‌ కొలువుల్లో స్థిరపడుతూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న ఐరుగురితో పాటు మరో మహిళను.. ఒకరి నిర్లక్ష్యం బలితీసుకుంది. గమ్యం చేరడానికి మరో రెండు గంటల సమయం ఉందనగా, గాఢ నిద్రలో ఉన్న వారు అనంతలోకాలకు వెళ్లిపోయారు. పండుగ పూట ఆ ఇళ్లలో మిగిలిన కడుపుకోత ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దోరకుంట వద్ద విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై ఆగి ఉన్న ట్రాలీ లారీని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాత పడగా 15మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెదిన యాసరపు చిన్ని, బొల్లిపోగు మేరిజ్యోష్నా, సురవరపు షకీన, చెన్నకేశవుల నాగేంద్రబాబు, పిడికిడి లక్ష్మీతేజ, కొండురు భావనవర్ష ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement