కొందరికే యూనిఫాం | - | Sakshi
Sakshi News home page

కొందరికే యూనిఫాం

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

కొన్ని మండలాల్లో పరిస్థితి ఇలా..

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత యూనిఫాం పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. జిల్లాలో సగం మందికే యూనిఫాం అందగా మిగతా సగం మంది విద్యార్థులు యూనిఫాం కోసం ఎదురుచూస్తున్నారు.

సగం మందికిపైగా అందలే..

జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిల్లో ఈ ఏడాది 50వేల మంది విద్యార్థులు నమోదయ్యారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు 21 వేల మంది విద్యార్థులకు మాత్రమే యూనిఫాం అందింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లు అందించాల్సి ఉంది. ఇందుకోసం సంబంధిత అధికారులు మహిళా సంఘాలకు యూనిఫామ్‌ల కుట్టే బాధ్యతలు అప్పగించారు. వస్త్రాల సరఫరా, కొలతలు తీసుకోవడం, కుట్టించడం, పంపిణీ లో జాప్యం జరిగింది. దీంతో ఇప్పటికీ మిగిలిన సగానికిపైగా విద్యార్థులకు యూనిఫాం అందలేదు.

కొలతల్లో హెచ్చుతగ్గులు

యూనిఫామ్‌ల కొలతలు తీసుకునే సమయంలోనూ పలుచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల వయసు, శరీరాకృతికి అనుగుణంగా సరైన కొలతలు తీసుకోకపోవడంతో కొందరికి దుస్తులు బిగుతుగా, మరికొందరికి వదులుగా వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన కొలతలు లేకుండా కుట్టించిన యూనిఫాంను తిరిగి సరిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులకు యూనిఫాంలు అందించే ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.

పాఠశాలలకు వెళ్తున్నా.. యూనిఫాం లేదు

విద్యార్థులందరికీ ఒకే విధమైన యూనిఫాం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులందరికీ ఒకేసారి యూనిఫాం అందకపోవడంతో పాఠశాలల్లో అసమాన పరిస్థితి కనిపిస్తోంది. యూనిఫాం అందిన విద్యార్థులు కొత్త దుస్తులతో వస్తుండగా, అందని విద్యార్థులు సాధారణ దుస్తులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు.

ఫ మఠంపల్లి మండలంలో 32 ప్రభుత్వ పాఠశాలల్లో 2,596 మంది విద్యార్థులున్నారు. 23 పాఠశాలలకు చెందిన 1,210 మంది విద్యార్థులకే యూనిఫాం అందింది. తొమ్మిది పాఠశాలలకు చెందిన 1,386 మంది విద్యార్థులకు యూనిఫాం అందజేయాల్సి ఉంది

ఫ పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో యూనిఫాం కొలతలు తేడాతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మండలంలోని హైస్కూల్‌ విద్యార్థులకు యూనిఫాం అందలేదు.

ఫ ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో 2,694 మంది విద్యార్థులకు గాను 1,450 మందికే ఒక్కో జత యూనిఫాం అందింది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆ ఒక్క జత కూడా అందలేదు. అందిన దుస్తులు సైతం నాణ్యత లేకుండా ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు అంటున్నారు.

ఫ హుజూర్‌నగర్‌ మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు ఇంతవరకు యూనిఫాం అందజేయలేదు.

ఫ గరిడేపల్లి మండలంలో మొత్తం 49 పాఠశాలలు ఉండగా కొందరికే యూనిఫాం ఇచ్చారు. ఇంకా 4,120 మంది విద్యార్థులకు యూనిఫామ్‌ పంపిణీ చేయాల్సి ఉంది.

ఫ ఇప్పటి వరకు 21 వేల మంది

విద్యార్థులకు పంపిణీ

ఫ ఈ ఏడాది అన్ని స్కూళ్లలో

50 వేల మంది నమోదు

ఫ మిగతా వారికి తప్పని ఎదురుచూపులు

ఫ యూనిఫాం ఇచ్చిన చోట కొలతల్లో

హెచ్చుతగ్గులతో ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement