కోట్ల
కోదాడ : రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన కష్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని జిల్లాలో పలువురు రైస్ మిల్లర్లు భారీగా పక్కదారి పట్టించారు. కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు జరుపుతున్న దాడుల్లో మిల్లర్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 15 మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేయగా సీఎంఆర్ ధాన్యంలో భారీ తేడాలు ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ 15 మిల్లుల వద్ద 1,81,667 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండాల్సి ఉండగా కేవలం 72,171 మెట్రిక్ టన్నులఽ ధాన్యమే ఉంది. 1,29,292 మెట్రిక్ టన్నులు మాయం చేశారు. దీని విలువ రూ.400 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్ ధాన్యం కేటాయించిన అన్ని మిల్లుల్లో తనిఖీలు చేస్తే ఈ కుంభకోణం మరో రూ.400 కోట్ల వరకు విస్తరించే అవకాశం ఉందని, మొత్తంగా దాదాపు రూ.800 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టి ఉండొచ్చని అధికారుల అంచనా.
కోర్టుకు వెళ్లారని..
ప్రభుత్వం నుంచి సీఎంఆర్ ధాన్యం తీసుకుంటున్న సమయంలోనే ముందస్తుగా మిల్లర్లు పక్కా ప్రణాళికతో ఈ ధాన్యం మాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ధాన్యం మిల్లులకు తరలించిన తరువాత ధాన్యం దిగుమతి చేసుకున్న మిల్లర్లు కొద్దిరోజుల వ్యవధిలోనే తమకు కేటాయించిన ధాన్యం నాణ్యత లేదని... దీన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి వారి నుంచి రిసీవ్డ్ కాపీ తీసుకుంటున్నారు. అధికారులు దీనిపై విచారణ చేయకుండా మిల్లర్లకు లోపాయికారీగా సహకరిస్తూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సీఎంఆర్ బియ్యం ఇవ్వమని సదరు మిల్లర్లను అధికారులు అడిగినప్పుడు.. గతంలో తమకు నాణ్యత లేని ధాన్యం ఇచ్చారని.. దీనిపై తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పి కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు. సంవత్సరాల కొద్ది దీన్ని పొడిగించుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. ఒకవేళ అధికారులు మిల్లులకు ధాన్యం కేటాయించడం ఆపివేస్తే ఇతర ప్రాంతాల్లో మిల్లులను లీజుకు తీసుకొని బినామీల పేరుతో అక్కడ తిరిగి తమ దందా కొనసాగిస్తున్నారు. అధికారులు, మిల్లర్లు కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ దందా చేస్తున్నారని పలువురు మిల్లర్లే అంటున్నారు. ఈ వ్యవహారంలో సివిల్ సప్లయ్ అధికారుల పాత్రపై కూడా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని వారు అంటున్నారు.
నిద్రావస్థలో జిల్లా యంత్రాంగం
సీఎంఆర్ ధాన్యం మిల్లులకు కేటాయించిన తరువాత వారు బియ్యం ఇచ్చేవరకు తరచూ తనిఖీలు చేయాల్సిన స్థానిక సివిల్ సప్లయ్ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కవుతున్నారు. వేల టన్నుల ధాన్యం బయటకు తరలిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. జిల్లా నుంచి విజిలెన్స్ అధికారులు వచ్చి దాడులు చేసే వరకు అక్రమాలు బయటకుయ రాకుండా కాపాడుతున్నారని పలువురు అంటున్నారు. అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
15 మిల్లుల్లో లెక్క తేల్చిన విజిలెన్స్ అధికారులు
ఫ సీఎంఆర్ ధాన్యంలో భారీ తేడాలు
ఫ మిగతా మిల్లుల్లో మరో
రూ.400 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అనుమానాలు
ఇది కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ వద్ద ఉన్న ఓ పారబాయిల్డ్ రైస్ మిల్లు.
ఈ మిల్లు యజమాని సీఎంఆర్ ఇవ్వకుండా
ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం పక్కదారి పట్టించాడు. ప్రభుత్వానికి రూ.34 కోట్ల మేర బాకీ పడ్డాడు. ప్రభుత్వం ఈ మిల్లుకు ధాన్యం కేటాయించకుండా మిల్లు యజమానిపై కేసులు పెట్టింది. ఇది జరిగి నాలుగేళ్లవుతున్నా నేటి వరకు ఈ మిల్లర్‌పై చర్యలు తీసుకోలేదు. ఒక్క రూపాయి
వసూలు చేయలేదు. అధికారులను విషయమై అడిగితే మిల్లర్ కోర్టుకు వెళ్లారని తాపీగా సమాధానం ఇస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లతో అధికారులు కుమ్మకై ్క కోర్టుల బూచి చూపుతూ పరోక్షంగా మిల్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


