సూర్యాపేట : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ యునైటెడ్ ట్రస్మా, తెలంగాణ ప్రైవేట్ టీచర్ అండ్ లెక్చరర్స్‌ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువదని, అలాంటి గురువును హత్య చేయడం దారుణమన్నారు. ఉపాధ్యాయులకు రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ట్రస్మా ప్రతినిధులు హరి, ఆర్.ప్రకాష్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాసనాయుడు, భిక్షపతి, రమేష్, లింగారెడ్డి, అజయ్‌కుమార్, ఉపేందర్‌రావు, నరసింహారావు, సోమరాజు, బాలకృష్ణ, రాజశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


