సంతోషిమాత ఆలయంలో కలశ స్థాపన | - | Sakshi
Sakshi News home page

సంతోషిమాత ఆలయంలో కలశ స్థాపన

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని సంతోషి మాత ఆలయంలో బుధవారం కలశ స్థాపన పూజలతో సంతోషిమాత జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకుడు బట్టారం వంశీకృష్ణ ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యాహవాచనం, మంటపారాధన, కంకణ ధారణ, దీక్ష వస్త్రధారణ నిర్వహించారు. అనంతరం రుద్రహోమం, లలిత హోమం చేపట్టారు. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు బ్రాహ్మడ్లపల్లి మురళీధర్‌, ప్రధాన కార్యదర్శి పబ్బ ప్రకాష్‌, కోశాధికారి కొత్త మల్లికార్జున్‌, సహాయ అర్చకుడు అశోక్‌ మిశ్రా, భక్తులు పాల్గొన్నారు.

లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని బుధవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. కల్యాణతంతులో భాగంగా స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతిరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

12వ బెటాలియన్‌

కమాండెంట్‌గా రామకృష్ణ

రామగిరి(నల్లగొండ): నల్లగొండ మండల పరిధిలోని అన్నెపర్తిలో గల 12వ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌గా బి.రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తిస్తూ బెటాలియన్‌కు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement