సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి నాయకులు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో దివ్యాంగుల ఐక్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీక్షలను సమితి నాయకులు ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపార, పారిశ్రామిక, విద్యా రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. దీక్షల్లో పాల్గొన్న వారికి బీసీ ఉద్యమ నాయకుడు వట్టె జానయ్య యాదవ్‌తో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. దీక్షలో పాల్గొన్న వారిలో షేక్ నయీమ్. జహీర్ బాబా, కొరివి సైదులు, మిద్దె సైదులు, స్నేహలత, భిక్షపతి, మాధవ్రెడ్డి, జయకృష్ణ, యాదగిరి, సుశీల, సునీత, వీరమ్మ, రమేష్, ఏలె జానయ్య, రుక్సానా, కుర్రి నాగయ్య, వెంకట్‌రెడ్డి, రాంకుమార్, సంతోష, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.


