ఫ కోదాడ కేంద్రంగా బ్లాక్ దందా ఫ పట్టణ శివారులోని గోదాములో నిల్వచేసిన వ్యాపారులు
కోదాడ శివారు తమ్మర వద్ద ఉన్న సబ్బుల గోదాములో అక్రమంగా యూరియా
నిల్వచేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లిన కోదాడ ఏడీఏ, ఏఓలు సదరు గోదాములో ఎంత నిల్వలు ఉన్నాయి..
అవి ఎవరివి.. రెండు దుకాణాలకు ఒకే గోదాము ఎందుకు ఉన్నది.. యూరియా హోల్‌సేల్ డీలర్ గోదాములో ఇతర
ఎరువులు ఎలా ఉన్నాయి.. అన్న విషయాలపై విచారణ చేయలేదు. దీనిపై వివరణ కోరడంతో వెంటనే వ్యాపారిని పిలిపించి
కొంత డబ్బు వసూలు చేసి నోటీసు ఇస్తున్నట్లు ఫొటో దిగి
ఉన్నతాధికారులకు పంపారు. కానీ, గోదామును మాత్రం
సీజ్ చేయలేదు. దీంతో వ్యాపారి రాత్రికి రాత్రే సరుకును
తరలించాడని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇది కోదాడ పట్టణ శివారులోని ఓ సబ్బుల కంపెనీకి చెందిన గోదాము. దీంట్లో కొంతకాలంగా కొందరు వ్యాపారులు భారీగా యూరియాను నిల్వచేసి రాత్రి సమయాల్లో ఖమ్మం, ఇతర జిల్లాల వారికి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. రెండు
రోజుల క్రితం యూరియాను తరలిస్తుండగా రైతులు పట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది గమనించిన వ్యాపారులు
వెంటనే రంగంలోకి దిగి అధికారులకు రూ.లక్షల్లో ముట్టజెప్పారు. ఇంకేముంది అక్కడ ఏమి జరగలేదని. వారికి నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇంకా విచిత్రమేమిటంటే అప్పటి వరకు అది ఎరువుల గోదామని ఎవరికి తెలియదు. విషయం బయటకు పొక్కిన తరువాత గోదాముకు రెండు దుకాణాల బ్యానర్లు కట్టారు.
కోదాడ : యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. వ్యాపారుల మాత్రం వందల బస్తాల యూరియాను అక్రమంగా నిల్వచేసి బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. నిత్యం పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో వ్యాపారులకే కొమ్ముకాస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క యూరియా బస్తాకోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతుండగా వ్యాపారులు వందల బస్తాలను ఇతర జిల్లాలకు ఎలా తరలిస్తున్నారో అర్థంకాని పరిస్ధితి. రెండు రోజుల క్రితం కోదాడలో బయట పడిన యూరియా బ్లాక్ మార్కెట్ దందాలో అధికారులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.
ఇంత జరిగినా సీజ్ చేయని గోదాము
తమ్మర వద్ద యూరియా నిల్వ చేయడానికి సదరు వ్యాపారులకు అనుమతి ఉందా.. అక్కడ అంత భారీగా యూరియా నిల్వ చేయడానికి నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారికి ఎవరు అనుమతి ఇచ్చారు. అక్కడ యూరియాతో పాటు ఇతర ఎరువులు ఎందుకు ఉన్నాయని వాటిపై అధికారులు సమాధానం ఇవ్వడం లేదు. అక్రమాలు జరిగాయని రైతులు ఫిర్యాదు చేస్తే వెంటనే సదరు గోదామును సీజ్ చేయాల్సిన అధికారులు.. స్టాఫ్ సేల్స్.. నోటీసు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రైతులు అంటున్నారు. అప్పటి వరకు గోదాములో ఏమి నిల్వ చేశారో రహస్యంగా ఉంచిన వ్యాపారులు రైతుల ఫిర్యాదు అనంతరం ఒకే గోదాముకు రెండు దుకాణాల బోర్డులు ఏర్పాటు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని రైతులు కోరుతున్నారు.
ఫ ఖమ్మం, ఇతర జిల్లాలకు
తరలిస్తుండగా పట్టుకున్న రైతులు
ఫ కనీస చర్యలు తీసుకోని
వ్యవసాయ శాఖ
ఫ మిగిలిన నిల్వలు
రాత్రికి రాత్రే తరలింపు
ఫ నోటీసులు ఇచ్చామని
చెబుతున్న అధికారులు


