ఫ ఏర్పాటుకు స్థల పరిశీలన
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో వియత్నాం దేశానికి చెందిన అమితాబ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ దేశ ప్రతినిధులు శనివారం స్థల పరిశీలన చేశారు. బుద్ధవనంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం వియత్నాం దేశ ప్రతినిధులు, ఇంజనీర్లు, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్యతో కలిసి సుమారు 45 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గాను అనువైన స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డిజిటల్ మ్యూజియం సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మల్లెపల్లి లక్ష్మయ్య తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి బుద్ధవనం ప్రాజెక్టు తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. అనంతరం వియత్నాం దేశ ప్రతినిధులు నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమయంలో బుద్ధవనం డీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ నజీష్, ఆర్‌ఆండ్‌బీ డీఈ సతీష్, ఏఈ ప్రదీప్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్‌రావు, టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


