చివ్వెంల (సూర్యాపేట) : ప్రతిఒక్కరూ రాజ్యాంగ హక్కులు పొందడంతో పాటు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని విధులు నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమల హస్సేన్ పాల్గొన్నారు.
కాంట్రాక్టు కార్మికులను
విధుల్లోకి తీసుకోవాలి
మేళ్లచెరువు : అన్యాయంగా తొలగించిన తమ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పులిచింతల ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు వద్ద గల జెన్‌కో గేటు ఎదుట కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష మూడవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ సమయం నుంచి కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నామని, మరి కొందరు నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు పోగొ ట్టుకున్న కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తుండగానే సమాచారం లేకుండానే తొలగించాని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి తాము భూములిస్తే కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చి తొలగించడం సరికాదని వజినేపల్లి గ్రామానికి చెందిన పలువురు వాపోయారు.
విద్యార్థులు చట్టాలపై
అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల (సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత అన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట పట్టణంలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన న్యాయప్రాప్తి– ఉచిత న్యాయ సహాయంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.


