కోదాడరూరల్ : ఆర్‌ఎంపీలు తమ పరిధికి మించి వైద్యం చేయవద్దని జిల్లా ఆర్‌ఎంపీల సంఘం అధ్యక్షుడు దొంతగాని రవిబాబు సూచించారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఆర్‌ఎంపీ, పీఎంపీల అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సీరియస్, అబార్షన్ కేసులను తీసుకోవద్దని, లింగ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించవద్దన్నారు. పరిధికి మించి వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దన్నారు. కేసు సీరియస్‌గా అనిపించిన వెంటనే ఆయా విభాగాల్లో క్వాలిఫైడ్ వైద్యుల వద్దకు వెళ్లాలని సూచించాలన్నారు. కొత్తగా ఆర్‌ఎంపీలు వస్తున్న వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచనలు పాటించాలన్నారు. సమస్యల పరిష్కారానికి సంఘం సభ్యులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎంపీల సంఘం మండల అధ్యక్షుడు భూతం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం సభ్యులు వెంకటప్పయ్య, అంజిరెడ్డి, సిద్ధారెడ్డి, ఉపేందర్, శ్రీశైలం, ఖాజా, శౌరీ, నాగరాజు, లింగయ్య, శ్రీకాంత్, నాని, తదితరులు పాల్గొన్నారు.


