భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి. హరిసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 106 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ హరిసింగ్


