రామన్నపేట : విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్ డి. శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన స్వగ్రామమైన రామన్నపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సదర్భంగా సర్పంచ్ కంచి మధుసూదన్, గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు. తాను చదువుకున్న పాఠశాలలోని గదులు చూసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల అభివృద్ధికి తన వంతుగా రూ.50వేల ఆర్థికసాయం అందజేశారు. సీనియర్ శాస్త్రవేత్త చౌదరి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కొండకింది అంజిరెడ్డి చెరో రూ.10వేలు ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంచి మధుసూదన్, టీచర్లు కళావతి, పరమేశ్వరి, లతీఫ్, సంధ్య, గీత సోషల్ వర్కర్ ఎర్ర నరేష్, పంచాయతీ కార్యదర్శి పవన్‌కుమార్, గ్రామపెద్దలు కొండకింది శేఖర్‌రెడ్డి, కడారి శ్రీనివాస్, కాల్య రవికుమార్, గంగుల రాఘవరెడ్డి, ముక్కాముల సతీష్, తాడూరి సైదులు తల్లితండ్రులు పాల్గొన్నారు.
ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి


