తుంగతుర్తి : ఆషాఢ మాసం సందర్భంగా గ్రామాల్లో బోనాల సందడి నెలకొంటున్నది. ఆదివారం మండలంలోని వెంపటి గ్రామంలో బట్టుగూడ ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. గ్రామంలోని మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.
వెంపటి గ్రామంలో బోనాలతో
ఆలయానికి వెళ్తున్న మహిళలు


