చివ్వెంల (సూర్యాపేట) : న్యాయవాదులంతా కక్షిదారులుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ న్యాయసేవలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. నూతనంగా ఎన్నికై న సూర్యాపేట బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తికి శాలువా కప్పి, పూలమొక్కను అందజేసి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, ఉపాధ్యక్షుడు పోలెబోయిన నర్సయ్య యాదవ్, జాయింట్ సెక్రటరీ పసల బాలరాజు, గేమ్స్ సెక్రటరీ పత్తిపాక రాధాకృష్ణ, ఈసీ సభ్యులు వసంత సత్యనారాయణపిళ్లే యాదవ్, బొమ్మగాని శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్, బొజ్జ అనిల్, బుక్క సుజాత, న్యాయవాదులు బచ్చలకూరి గోపి, ధరావత్ వీరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫజిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద


