సూర్యాపేట అర్బన్ : మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలని మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంపటి గురూజీ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట పట్టణ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. మున్సిపల్ అధికారులు కార్మికులకు చట్ట ప్రకారం దక్కాల్సిన హక్కులు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అందిస్తూ వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో వెంకటాద్రి, నాగేశ్వరరావు, శ్వేత, కుమారి, సువార్త, కళమ్మ, వెంకటమ్మ, సతీష్, నవీన్, ఉప్పలయ్య, మారయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


