మోతె : వన నర్సరీల్లోని మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా నీరు అవి ఎండిపోకుండా సంరక్షించాలని జిల్లా ఆడిటింగ్ అధికారి (డీఏఓ) శ్యాంసుందర్ అన్నారు. బుధవారం మోతె మండలం రాఘవాపురం, నామవరంతోపాటు పలు గ్రామాల్లో నర్సరీలను పరిశీలించి మాట్లాడారు. నర్సరీల నిర్వహణకు రికార్డుల మెయింటెనెన్స్ పక్కాగా ఉండాలన్నారు. ఉపాధి కూలీల సంఖ్య పెంచాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు వేసవిలో తాగునీరు, నీడ సౌకర్యంతో పాటు మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని సంబంధిత పీఓ, ఏపీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కృష్ణవంశీ, ఏపీఓ నాగేష్, పంచాయతీ కార్యదర్శి రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ దుచ్చర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


