ఆస్తి పన్ను డిమాండ్ ఇలా..
ముందే చెల్లించు
ప్రభుత్వం ప్రకటించినన 5 శాతం ఆస్తి పన్ను రాయితీని మున్సిపాలిటీ ప్రజలంతా సద్విని యోగం చేసుకోవాలి. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో గాని, ఆన్‌లైన్ ద్వారా గాని ఒకేసారి ఆస్తిపన్నును చెల్లించి ఐదు శాతం రాయితీ పొంద్దవచ్చు. పట్టణవాసులు ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి.
– సీహెచ్.హనుమంతరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట
సూర్యాపేట అర్బన్ : నిర్ణీత సమయంలో ఆస్తి పన్ను వసూలు చేసి మున్సిపాలిటీల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ ఎర్లీ బర్డ్ పథకం ప్రవేశపెట్టింది. ఈమేరకు మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
30 వరకు చెల్లిస్తేనే ప్రయోజనం
జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఈ నెల ఒకటి నుంచి 30వ తేదీ వరకు ఆస్తి పన్ను చెల్లించే యజమానులకు 5 శాతం రాయితీ వర్తిస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రాయితీ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రతి మున్సిపాలిటీలలోనూ పన్ను మేళాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పన్ను చెల్లింపులను మెరుగుపరిచేందుకు కమిషనర్లు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేయాలని ఆదేశించారు. గత సంవత్సరాలకు సంబంధించిన పన్ను బకాయిలు ఉన్నట్లయితే, వాటిపై ఎటువంటి రాయితీ వర్తించదు. బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాతే ప్రస్తుత ఏడాది రాయితీని పొందే అవకాశం ఉంటుంది. ఎర్లీ బర్డ్ స్కీం కోసం ఆరు మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మున్సిపాలిటీల ఆర్థిక బలోపేతానికి..
ముందస్తు ఆస్తి పన్ను చెల్లించేందుకు ఉత్సాహంగా ఉన్న యజమానులకు 5శాతం రాయితీ శుభవార్తగా మారింది. ముందస్తు పన్ను వసూలులో రెవెన్యూ పరంగా మున్సిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అభివృద్ధికి ముందడుగుగా భావిస్తున్నారు. ఏటా ఆస్తి పన్ను వసూలు వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ స్కీమ్ ఉపయుక్తంగా మారింది.
ఆన్‌లైన్‌లోనూ చెల్లించేలా..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియను వేగవంత చేయాలని జిల్లా యంత్రాంగం.. మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. మీ–సేవ కేంద్రాల ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చు.
మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను
వసూలుకు ఎర్లీబర్డ్ స్కీం
ఫ 30వ తేదీ వరకు చెల్లించిన వారికే 5శాతం రాయితీ వర్తింపు
ఫ బకాయిదారులకు
రాయితీ ఉండదు
ఫ ప్రత్యేక కౌంటర్లు
ఏర్పాటు చేసిన యంత్రాంగం
మున్సిపాలిటీ భవనాలు డిమాండ్ (రూ.కోట్లలో..)
సూర్యాపేట 36,800 21
తిరుమలగిరి 5,540 1.48
నేరేడుచర్ల 4,194 1.38
హుజూర్‌నగర్ 8,957 4.11
కోదాడ 17,718 8.23


