
ఓటరు జాబితాపై అభ్యంతరాలు తెలపాలి
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఓటరు జాబితా, ప్రచురణ, పోలింగ్ స్టేషన్ల జాబితా అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఎంపీడీఓలకు తెలపాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్‌పీఓ నారాయణరెడ్డి, నాయకులు కొప్పుల వేణారెడ్ది, రాజేశ్వరరావు, ఆజాద్, హబీద్, క్రాంతి, కోట గోపి, బడుగుల లింగయ్యయాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, రమేష్, వెంకటేశ్వర్లు, డేవిడ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.