
పథకాల అమలులో ఉద్యోగుల బాధ్యత కీలకం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల బాధ్యత అతి కీలకమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.అదనపు కలెక్టర్ రాంబాబు 1995లో డిప్యూటీ తహసీల్దార్ గా ప్రయాణం మొదలు పెట్టారన్నారు. ఏడేళ్లుగా అదనపు కలెక్టర్ గా నిబద్ధత తో విధులు నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రజలకు సేవ చేయటం చాలా అభినందనీయమన్నారు. హుజూర్ నగర్ నుంచి సన్న బియ్యం పంపిణీ, తిరుమలగిరి నుంచి రేషన్ కార్డుల పంపిణీలాంటి సంక్షేమ పథకాలు అదనపు కలెక్టర్ సహకారంతో జిల్లాలో విజయవంతం చేశామన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి లో పర్యటనలు చేసి భూ సమస్యలు పరిష్కరించటంలో ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, జెడ్పీసీఈఓ వివి అప్పారావు, జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్